మహిళలకు జొమాటో కొత్త డ్రెస్ కోడ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా రైడర్ల కోసం జోమాటో కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా రైడర్ల కోసం జోమాటో కీలక నిర్ణయం తీసుకుంది. చాలా మంది మహిళ రైడర్స్ టీ షర్టులు ధరించి ఫుడ్ డెలివరీ చేయడం అసౌకర్యానికి గురవుతున్నారని సమాచారం. దీంతో ఈ విషయం జొమాటో దృష్టికి రావడంతో.. వారి డ్రెస్ కోడ్ మార్చాలని భావించింది.
ఈ క్రమంలో మహిళలకు కుర్తాలు డ్రెస్ కోడ్‌గా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఉమెన్స్ డే సందర్భంగా కొత్త డ్రెస్ కోడ్ ప్రకటించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా జొమాటో డ్రెస్ కోడ్ వీడియో విడుదల చేసింది. దీంతో ఆ పోస్ట్ తాజాగా వైరల్‌గా మారింది. కొత్త డ్రెస్ కోడ్ పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయం ఉట్టిపడేలా కుర్తాలు బాగున్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.