Zameer Ahmed Khan : ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. కర్నాటక మంత్రికి సమన్లు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్నాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్‌కు లోకాయుక్త పోలీసులు శనివారం సమన్లు జారీ చేశారు.

Update: 2024-11-16 18:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్నాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్‌కు లోకాయుక్త పోలీసులు శనివారం సమన్లు జారీ చేశారు. డిసెంబర్ 3లోగా లోకాయుక్త ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఈ కేసులో మంత్రి తెచ్చుకున్న స్టే గడువు ముగియడంతో మళ్లీ విచారణ ప్రారంభం అయింది. ఐఎంఏ పొంజి స్కామ్‌లో జమీర్ అహ్మద్ ఖాన్‌పై అగస్టు 2021లో ఈడీ దాడులు నిర్వహించింది. ఈ అక్రమాస్తుల కేసు తదుపరి దర్యాప్తును ఈడీ ఏసీబీకి అప్పగించింది. అనంతరం ఏసీబీ ఈ కేసును లోకాయుక్తకు అప్పగించింది. మంత్రిపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్(పీసీ) యాక్ట్ 1988 ప్రకారం లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తాజాగా లోకాయుక్త మంత్రికి సమన్లను శనివారం జారీ చేసింది. సమన్ల జారీపై మంత్రి జమీర్ ఖాన్ స్పందిస్తూ.. విచారణలో భాగంగా లోకాయుక్త సమన్లు జారీ చేసింది. ఇందులో కొత్తమే లేదని అన్నారు.

Tags:    

Similar News