వావ్ గ్రేట్.. బాలిక ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న సూది.. ఆపరేషన్ లేకుండా బయటకు తీసిన డాక్టర్లు (లైవ్ వీడియో)

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక వైద్య రంగంలో అనేక అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి.

Update: 2024-05-28 10:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక వైద్య రంగంలో అనేక అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా తమిళనాడు తంజావూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు అరుదైన చికిత్స చేసి అందరి చేత వావ్ అనిపించుకున్నారు. ఓ 14 ఏళ్ల బాలిక ఉపిరితిత్తుల్లో నాలుగు సెంటిమీటర్ల సూది ఇరుక్కుపోయింది. ఈ సూదిని ఎలాంటి ఆపరేషన్ లేకుండా వైద్యులు విజయవంతంగా బయటకు తీశారు. అయితే ఈ అరుదైన చికిత్సను కేవలం మూడున్నర నిమిషాల్లోనే పూర్తి చేయగా ఈ ప్రక్రియకు సంబంధించిన వీడియోనంతా రికార్డు చేశారు. ఈ చికిత్స కోసం డాక్టర్లు బ్రాంకోస్కోపీ అనే అధునాతన సాంకేతికతను ఉపయోగించారు. ఈ టెక్నాలజీ ఊపిరితిత్తుల వ్యాధి నిర్థరణ, చికిత్స సమయంలో ఉపయోగిస్తారు. ఓ సన్నని గొట్టానికి కెమెరాను బిగించి శ్వాసనాళంలోకి పంపించి చికిత్స చేస్తారు.కాగా సదరు బాలిక దుస్తులు మార్చుకుంటుండగా ప్రమాదవశాత్తు నోటి మార్గం గుండా ఊపిరితిత్తుల్లోకి సూది వెళ్లినట్లు వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News