ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎలివేటర్ ఇండియాలో ఓపెన్! (వీడియో)
ఒక విధంగా ఇది ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొంటున్నారు. World's largest elevator installed in Jio World Center.
దిశ, వెబ్‌డెస్క్ః ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలివేటర్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని ఎలివేటర్, ఎస్కలేటర్ పరిశ్రమలో గ్లోబల్ లీడర్ అయిన KONE ఎలివేటర్స్ ఇండియా నిర్మించింది. 25.78 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన దీని బరువు 16-టన్నులు కాగా, ఈ 5-స్టాప్ ఎలివేటర్ వ్యక్తుల వత్తిడి పరిగణలోకి తీసుకొని, అత్యంత అనుకూలమైనదిగా రూపొందించారు. అధిక నాణ్యత, భద్రతా అంశాలతో నిర్మించబడిన ఈ లిఫ్ట్ 200 మంది వ్యక్తులను ఒకేసారి తీసుకెళ్లగలదంటేనే దీని ప్రత్యేకత ఏంటో అర్థమవుతుంది.
ఈ ఎలివేటర్‌కు సరైన భద్రత ఇవ్వవడం కోసం 18 పుల్లీలు, 9 ఐరన్ తాళ్లను వినియోగించారు. ఒక విధంగా ఇది ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొంటున్నారు. ఇది సెకనుకు ఒక మీటర్ వేగంతో ప్రయాణిస్తుంది. దీనికున్న ప్రత్యేక ఫీచర్లలో గ్లాస్ వాల్, 4-ప్యానెల్ సెంటర్ ఓపెనింగ్ గ్లాస్ డోర్ ఉన్నాయి. అద్భుతమైన ఇంటీరియర్‌తో ఎలివేటర్ అందంగా రూపొందించారు. అందమైన బటన్ ప్యానెళ్లు, రెండు డిస్ప్లే స్క్రీన్లు ఇందులో ఉన్నాయి. ఈ సంవత్సరం మార్చిలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ముంబైలో సుమారు 18.5 ఎకరాల్లో ప్రారంభించిన జియో వరల్డ్ సెంటర్‌కు ఈ భారీ ఎలివేటర్ మరింత ప్రత్యేకతను అద్దింది.