ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ ను.. భారత ఆర్మీ, వాయుసేన సంయుక్తంగా దేశంలోని ఒక మారుమూల ప్రాంతానికి డెలివరీ చేసినట్లు తెలుస్తోంది.
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ ను.. భారత ఆర్మీ, వాయుసేన సంయుక్తంగా దేశంలోని ఒక మారుమూల ప్రాంతానికి డెలివరీ చేసినట్లు తెలుస్తోంది. సొంతంగా రూపొందించిన ఈ పోర్టబుల్ హాస్పిటల్ ను ఐఏఎఫ్ కు చనిదినా రవాణా విమానం ద్వారా.. సుమారు 15 వేల అడుగుల ఎత్తు నుంచి అనుకున్న లక్షిత ప్రాంతంలో పారాచ్యుట్ సహాయంతో జారవిడిచింది. విపత్కర సమయాల్లో మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఈ ఆపేరేషన్ ను నిర్వహించాయి భారత దళాలు. ఈ ఆపేరేషన్ లో ట్రామా కేర్ తదితర సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ లను తరలించారు.
అయితే.. భారత్ హెల్త్ ఇనీషియేటివ్ ఫర్ సహయోగ్ హిత మైత్రి (ప్రాజెక్ట్ - బీహెచ్ఐఎస్ హెచ్ఎం) ను దేశీయంగా అభివృద్ధి చేశారు. ఈ పోర్టబుల్ హాస్పిటల్ ను తరలించేందుకు ఐఏఎఫ్ అధునాతన సి -130 జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని భారత వాయుసేన ఉపయోగించింది. ఈ కీలక ఆపేరేషన్ లో భారత ఆర్మీకి చెందిన పారా బ్రిగేడ్ ముఖ్య పాత్ర పోషించింది.