Woman journalists: బంగ్లాదేశ్ లో మహిళా జర్నలిస్టులపై ఆగని దారుణాలు

బంగ్లాదేశ్ లో మహిళా జర్నలిస్టులపై ఆగని దారుణాలు ఆగడం లేదు.

Update: 2024-12-01 07:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బంగ్లాదేశ్ (Bangladesh)లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ భారతీయులు, హిందువులు సహా ఇతర మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయి. అక్కడి హిందువులకు మద్దతుగా ఉద్యమించిన స్వామి చిన్మయ్ కృష్ణదాస్ ను దేశద్రోహం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. తాజాగా భారతీయ ఏజెంట్ అని ఆరోపిస్తూ ఢాకాలో ఓ మహిళా జర్నలిస్టును (Woman journalist) మూకుమ్మడిగా అడ్డుకుని వేధింపులకు గురి చేయడం కలకలం రేపింది. బంగ్లాదేశ్ టీవీ జర్నలిస్ట్ మున్నీ సాహా (Munni Saha) కారును శనివారం ఢాకాలోని కార్వాన్ బజార్ లో అల్లరిమూకలు చుట్టుముట్టాయి. ఆమె భారతీయ ఏజెంట్ అని, మాజీ హసీనా ప్రభుత్వానికి మద్దతుదారు అని వేధించడం మొదలుపెట్టాయి. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ మహిళా జర్నలిస్టును అల్లరి మూకల బారీ నుంచి కాపాడారు. ఆఫీస్ నుంచి ఆమె బయటకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

గతంలో చెరువులో మహిళా జర్నలిస్టు మృతదేహం

ఇదిలా ఉంటే గత ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన అనంతరం బంగ్లాదేశ్‌కి చెందిన ఓ మహిళా జర్నలిస్ట్‌ మృతదేహాం చెరువులో ప్రత్యక్షం కావడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. గాజి గ్రూప్‌ యాజమాన్యంలోని బెంగాలీ భాష శాటిలైట్‌ మరియు కేబుల్‌ టెలివిజన్‌ ఛానెల్‌ అయిన ‘గాజి టివి’ న్యూస్ రూమ్ ఎడిటర్‌ సారా రహనుమా (Sarah Rahanuma) మరణం అందరిని షాక్ కు గురిచేంది. ఆమెది ఆత్మహత్య అని కొంత మంది వాదించగా ఆమెది దారుణమైన హత్య అని దేశం నుండి పారిపోయిన మాజీ ప్రధాని షేక్‌ హసీనా కుమారుడు సాజీద్‌ వాజద్‌ ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో భావప్రకటనా స్వేచ్ఛపై ఇది మరో క్రూరమైన దాడి అని విమర్శించాడు. 


Click Here For Twitter Post..

Tags:    

Similar News