Space Junk : అంతరిక్ష వ్యర్థాలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన
అంతరిక్షంలో పేరుకుపోతన్న వ్యర్థాల(Space Junk)పై ఐక్యరాజ్యసమితి(UNO) ఆందోళన వ్యక్తం చేసింది.
దిశ, వెబ్ డెస్క్ : అంతరిక్షంలో పేరుకుపోతన్న వ్యర్థాల(Space Junk)పై ఐక్యరాజ్యసమితి(UNO) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతినెలా ప్రపంచ దేశాలు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశ పెడుతుండటంతో.. భూ దిగువ కక్ష్య ఉపగ్రహాలు, వాటి వ్యర్థాలతో నిండిపోతుందని యూఎన్ఓ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం భూ దిగువ కక్ష్యలో 14 వేల ఉపగ్రహాలు ఉండగా.. వీటిలో 3500 ఉపగ్రహాలు నిరుపయోగంగా ఉన్నాయి. కాగా వీటి వలన 12 కోట్ల రాకెట్ శకలాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ట్రక్కు సైజులో ఉన్నవి కూడా ఉన్నాయి. అంతరిక్ష సమన్వయంపై ఏర్పాటు చేసిన యూఎన్ఓ ప్యానెల్ దీనిపై స్పందిస్తూ.. దిగువ కక్ష్యను సురక్షితంగా ఉంచుకోవాలని, లేదంటే ఉపగ్రహాలు ఢీకొనడం వలన అంతరిక్షాన్ని అంతరిక్ష కేంద్రానికి తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో ఉపగ్రహల డేటా సమాచారాన్ని అన్ని దేశాలు ఇచ్చిపుచ్చుకుంటే ఇన్ని వేల ఉపగ్రహాల అవసరం ఉండదని అన్నారు. భూ దిగువ కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలు 2024 తొలి ఆరునెలల్లో 50 వేలసార్లు ఢీకొనే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాయి అంటే ఆ కక్ష్యలో ఉపగ్రహాలు, వాటి శకలాల వ్యర్థాలు ఎంతగా పేరుకు పోయాయో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా చైనా, రష్యాలకు చెందిన ఉపగ్రహాలు పేలిపోయి వాటి వేలాది శకలాలు అంతరిక్షంలో వెదజల్లడంతో.. అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు గంటసేపు దాక్కోవాల్సి వచ్చింది.