Swiggy Bolt: స్విగ్గీ కీలక నిర్ణయం.. ఇకపై టైర్-2 పట్టణాల్లో 'బోల్ట్' సేవలు..!
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ(Food Delivery) సంస్థ స్విగ్గీ(Swiggy) కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ(Food Delivery) సంస్థ స్విగ్గీ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు 10 నిమిషాల్లో ఫుడ్ అందించే 'బోల్ట్(Bolt)' సర్వీసులను మరిన్ని నగరాలకు పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా దీన్ని 400 పట్టణాలకు విస్తరించినట్లు సంస్థ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా స్విగ్గీ మొదటగా బోల్ట్ సేవలను ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే వంటి మెట్రో నగరాల్లో మాత్రమే స్టార్ట్ చేసింది. దీనికి కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించడంతో తాజాగా టైర్-2, టైర్-3 పట్టణాలైన జైపూర్, లక్నో, అహ్మదాబాద్, ఇండోర్, గుంటూరు, వరంగల్, జగిత్యాల, నాసిక్ లోనూ ఈ సేవలను ప్రారంభిస్తున్నామని తెలిపింది. ముఖ్యంగా ఏపీ(AP), తెలంగాణ(TG)లో బోల్ట్ కు ఎక్కువ డిమాండ్ ఉంటోందని స్విగ్గీ పేర్కొంది. కాగా ప్రస్తుతానికి రెండు కిలోమీటర్ల(2 Km) వరకు మాత్రమే ఈ సేవలను పరిమితం చేశామని, రాబోయే రోజుల్లో దీన్ని మరిన్ని కిలోమీటర్లకు విస్తరిస్తామని వెల్లడించింది.