Mamata Banerjee :బంగ్లాదేశ్‌లో ‘ఐరాస’ దళాలను మోహరించాలి : సీఎం మమత

దిశ, నేషనల్ బ్యూరో : హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించేందుకు బంగ్లాదేశ్‌(Bangladesh)లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలను(UN peacekeeping mission) మోహరించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) డిమాండ్ చేశారు.

Update: 2024-12-02 12:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో : హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించేందుకు బంగ్లాదేశ్‌(Bangladesh)లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలను(UN peacekeeping mission) మోహరించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) డిమాండ్ చేశారు. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి సాయం కోరే అంశాన్ని పరిశీలించాలని భారత ప్రభుత్వానికి ఆమె సూచించారు. బంగ్లాదేశ్‌లో మతపరమైన వేధింపులు ఎదుర్కొంటున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే అంశంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీని మమత కోరారు.

సోమవారం బెంగాల్ అసెంబ్లీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరుగుతున్న అంశంపై భారత్ వైఖరి గురించి ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రధాని ప్రకటన చేయాలి. అది వీలుకాకపోతే కనీసం కేంద్ర విదేశాంగ మంత్రి దీనిపై ప్రకటన చేయాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు. ‘‘బెంగాల్‌కు చెందిన చాలామందికి బంగ్లాదేశ్‌లో బంధువులు ఉన్నారు. మా రాష్ట్రంలోని ఇస్కాన్ ప్రతినిధులతోనూ నేను చర్చించాను. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రతినిధుల అరెస్టులు ఆందోళనకర అంశం. అందుకే నేను ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడుతున్నా’’ అని దీదీ స్పష్టం చేశారు.

Tags:    

Similar News