Parliament : రాజ్యాంగంపై 13, 14 తేదీల్లో లోక్‌సభలో, 16, 17 తేదీల్లో రాజ్యసభలో చర్చ
దిశ, నేషనల్ బ్యూరో : 75వ భారత రాజ్యాంగ(Constitution) దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంటు (Parliament)లో ప్రత్యేక చర్చను నిర్వహించే అంశంపై కేంద్ర ప్రభుత్వం, విపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
దిశ, నేషనల్ బ్యూరో : 75వ భారత రాజ్యాంగ(Constitution) దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంటు (Parliament)లో ప్రత్యేక చర్చను నిర్వహించే అంశంపై కేంద్ర ప్రభుత్వం, విపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. డిసెంబరు 13, 14 తేదీల్లో లోక్‌సభ(Lok Sabha)లో, డిసెంబరు 16, 17 తేదీల్లో రాజ్యసభ(Rajya Sabha)లో చర్చను నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగిన అనంతరం దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేశారు.
రాజ్యాంగంపై జరగనున్న ప్రత్యేక చర్చల సందర్భంగా ప్రధాని మోడీ కూడా ప్రసంగించనున్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. అమెరికాలో గౌతం అదానీపై నమోదైన కేసుల అంశాన్ని ఈ చర్చల సందర్భంగా ప్రతిపక్షాలు ప్రస్తావించే అవకాశం ఉంది.