Proba-3 : ఈ నెల 4న నింగిలోకి ప్రొబా-3.. ఇస్రో అనౌన్స్

ప్రొబా-3/PSLV-C59 శాటిలైట్‌ ప్రయోగం ముహుర్తాన్ని సోమవారం ఇస్రో ప్రకటించింది.

Update: 2024-12-02 16:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ప్రొబా-3/PSLV-C59 శాటిలైట్‌ ప్రయోగం ముహుర్తాన్ని సోమవారం ఇస్రో ప్రకటించింది. ఏపీ శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 4వ తేదీన మధ్యాహ్నం 4.06 గంటలకు అంతరిక్షంలోని ప్రొబా-3ని ప్రయోగించినున్నట్లు అనౌన్స్ చేసింది. పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)-సీ59గా పిలవబడే ఈ శాటిలైట్ హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్‌తో సుమారు 550 కేజీల బరువు ఉంటుందని తెలిపింది. ‘ఇన్ ఆర్బిట్‌ డెమానిస్ట్రేషన్’ లక్ష్యంగా ప్రొబా-3ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి కక్ష్యలోకి పంపుతున్నట్లు వెల్లడించింది. ప్రొబా-3 మిషన్‌లో ప్రయోగించిన శాటిలైట్లు కృత్రిమ సూర్యగ్రహణ పరిస్థితులను సృష్టించనున్నాయి. ఈ మిషన్‌లో కరొనాగ్రాఫ్, అక్యుల్టర్ అనే రెండు స్పేస్ క్రాఫ్ట్‌లు ఉంటాయని ఇస్రో తెలిపింది. సూర్యుడి వాతావరణంలోని బయటి, అత్యంత వేడిపొర అయిన సోలార్ కరోనాను ఈ మిషన్ అధ్యయనం చేయనుంది. ఈ శాటిలైట్లలో ఒకటి సూర్యుడిని కనిపించకుండా కృత్రిమ గ్రహణం సృష్టిస్తే.. మరొకటి కరోనాను గమినించనుంది. 

Tags:    

Similar News