Belgium : సె*క్స్ వర్కర్లకు మెటర్నిటీ లీవ్స్, సిక్ లీవ్స్, పెన్షన్ హక్కులు
దిశ, నేషనల్ బ్యూరో : బెల్జియం(Belgium) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో : బెల్జియం(Belgium) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సె*క్స్ వర్కర్లకు కూడా సిక్ లీవ్స్, ప్రసూతి సెలవులు (maternity leaves), పెన్షన్ హక్కులను కల్పిస్తూ నూతన చట్టం చేసింది. అది డిసెంబరు 1 నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో ఇకపై బెల్జియంలో సె*క్స్ వర్కర్లకు మహిళా ఉద్యోగులతో సమానమైన సంక్షేమ ప్రయోజనాలు దక్కనున్నాయి. సె*క్స్ వర్కర్లు సిక్ లీవ్స్, మెటర్నిటీ లీవ్స్‌లో ఉన్న టైంలో విధులకు దూరంగా ఉండొచ్చు.
సెలవుల్లో ఉండగా సె*క్స్ కార్యకలాపాల్లో పాల్గొననందుకు వారిపై ఉద్యోగపరమైన చర్యలు తీసుకునే అధికారం లైసెన్సుడ్ వ్యభిచార గృహాల నిర్వాహకులకు ఇక ఉండదు. ఈ చట్టం అమల్లోకి రాకముందు దారుణ పరిస్థితులు ఉండేవి. గర్భం దాల్చిన తర్వాత కూడా సె*క్స్ వర్కర్లతో బలవంతంగా ఆ పని చేయించేవారు. ఇకపై అలాంటి అరాచకాలకు అవకాశం ఉండదు. 2022 సంవత్సరంలో బెల్జియంలో సె*క్స్ వర్క్‌ను డీక్రిమినలైజ్ చేశారు. అంటే ఆ పనిని చేయడం చట్టపరంగా నేరం కాదు.