Maharashtra CM: మహారాష్ట్ర సీఎం ఎంపికపై బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం

మహరాష్ట్ర ముఖ్యమంత్రి (Maharashtra CM )ఎంపికపై బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-12-02 11:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహరాష్ట్ర ముఖ్యమంత్రి (Maharashtra CM )ఎంపికపై బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. మహా సీఎంని ఎంపిక చేసేందుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman), బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ(Vijay Rupani)ని పరిశీలకులుగా నియమించింది. డిసెంబర్ 3 జరిగే బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఆ భేటీకి వీరద్దరూ హాజరుకానున్నారు. పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి(Maharashtra legislature party meet) పరిశీలకులుగా వ్యవహరించనున్నారు.. అలానే, శాసనసభా పక్షనేతగా దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ను ఎన్నుకునే ఛాన్స్ ఉంది. కాగా.. ముంబైలో జరిగే బీజేపీ సమావేశానికి ఆపార్టీ ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని అధిష్ఠనం పేర్కొంది.

సీఎం పదవి కోసం కసరత్తులు..

ఇకపోతే, మహరాష్ట్ర సీఎం ఎంపికపై మహాయుతి పెద్దల కసరత్తు కొనసాగుతూనే ఉంది. సోమవారం జరగాల్సిన మహాయుతి కూటమి భేటీ జరగలేదు. ఓవైపు, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరిపేందుకు ఎన్‌సీపీ అధినేత అజిత్ పవార్‌ ఢిల్లీకి పయనమయ్యారు. మరోవైపు, కేబినెట్‌ పదవులు ఖరారు చేసేందుకు మహాయుతి నేతల సమావేశానికి ఏక్‌నాథ్‌ షిండే హాజరుకాలేదు. షిండే గొంతు ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నారు. సతారా జిల్లాలోని తన స్వగ్రామంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. షెడ్యూల్‌ ప్రకారం.. మంగళవారం షిండే బీజేపీ పెద్దలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News