Sunita Williams: సునితా విలియమ్స్ కోసం సమోసా పార్టీ ..!
దాదాపు తొమ్మిది నెలల తర్వాత భారత సంతతి ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్(Sunita Williams) భూమిపైకి అడుగుపెట్టారు.

దిశ, నేషనల్ బ్యూరో: దాదాపు తొమ్మిది నెలల తర్వాత భారత సంతతి ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్(Sunita Williams) భూమిపైకి అడుగుపెట్టారు. సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారా బుధవారం తెల్లవారుజామున సురక్షితంగా ఫ్రోడా సముద్ర జలాల్లో దిగారు. సునితా భూమిపైకి సురక్షితంగా రావడంతో భారత్ లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబురాలు జరిగాయి. గుజరాత్‌లోని జలాసన్ లోని ఆమె బంధువులు, గ్రామస్థులు టపాసులు కాల్చి డ్యాన్స్‌లు చేశారు. ఆమె బంధువు ఫాల్గుణి పాండ్య గ్రామంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సునితా బంధువు ఫాల్గుణి పాండ్యా మీడియాతో మాట్లాడారు. త్వరలోని సునితా భారత్ కు రానున్నట్లు తెలిపారు. ‘‘సునితా కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాం. ఆమె భూమిపై దిగిన క్షణాలు మరువలేనివి. అంతా సాఫీగా సాగినందుకు ఆనందంగా ఉంది. ఎలాంటి సవాళ్లనైనా ఆమె ఎదుర్కోగలదు. మా అందరికీ ఆమె ఆదర్శం. ఇక, ఇప్పుడంతా సునితాకు ఫ్యామిలీ టైమ్ అని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఆమె భారత్ కు రానున్నారు. మేమంతా కలిసి వెకేషన్ ప్లాన్ చేస్తున్నాం. సునితా స్పేస్ లో ఉన్నప్పుడు కూడా ఆమెతో టచ్ చలోనే ఉన్నాం. నేను మహాకుంభమేళాకు వెళ్లినప్పుడు ఆ విశేషాలను ఆమె అడిగి తెలుసుకున్నారు” అని చెప్పుకొచ్చారు.
సమోసా పార్టీ..
సునితా విలియమ్స్ మళ్లీ అంతరిక్షంలోకి వెళ్తారా లేదా మార్స్ పైకి వెళ్లిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారా అనే ప్రశ్న ఫాల్గుణి పాండ్యాకు ఎదురైంది. అయితే, అది ఆమె ఛాయిస్ అని పాండ్యా చెప్పుకొచ్చారు. ఎక్కువకాలం స్పేస్ లో ఉండటం గురించి మాట్లాడుతూ.. ఆస్ట్రోనాట్ ఏ పరిస్థితుల్లోనైనా ఉత్తమంగా పనిచేస్తారన్నారు. ఆమె అందరికీ రోల్ మోడల్ అని చెప్పుకొచ్చారు. సునితా పుట్టినరోజున భారతీయ స్వీట్ కాజు కత్లీని పంపినట్లు ఆమె తెలిపారు. సునితా విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలో సమోసాలు కలిగి ఉన్న తొలి ఆస్ట్రోనాట్ అని.. ఆమె కోసం సమోసా పార్టీ ఇవ్వడానికి ఎదురుచూస్తున్నానని ఫాల్గుణి పాండ్యా చమత్కరించారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ కూడా సునితా విలియమ్స్‌ను భారత్‌కు ఆహ్వానించారు. ఇటీవల ఆమెకు లేఖ రాసిన ప్రధాని.. ‘‘మీరు తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని భారత్‌లో చూసేందుకు ఎదురుచూస్తున్నాం. తన కుమార్తెలకు ఆతిథ్యం ఇవ్వడం పట్ల భారత్ సంతోషంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఇకపోతే, భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపక్ పాండ్యా, స్లొవీన్ అమెరికన్ ఉర్సులైన్ బోనీలకు 1965 సెప్టెంబర్ 19న ఒహాయోలో సునీత జన్మించారు. పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం కాగా.. సునీత చిన్న కుమార్తె. దీపక్ పాండ్యా గుజరాత్‌లో జన్మించారు. ఇకపోతే, 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునితా, బుచ్ విల్మోర్ లు ఐఎస్‌ఎస్ (ISS)కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వారిద్దరూ వారం రోజులకే భూమిపైకి రావాల్సి ఉండగా.. అది కుదర్లేదు. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. దీంతో వారు ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుకుపోయారు. కాగా, స్పేస్ఎస్ క్రూ డ్రాగన్ ద్వారా వారు భూమిపైకి వచ్చారు.