Madhya Pradesh: విధుల్లో మరణిస్తే భార్య, తల్లిదండ్రులకు సమాన పరిహారం

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్(Mohan Yadav) ఎక్స్ గ్రేషియా విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-07-20 06:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్(Mohan Yadav) ఎక్స్ గ్రేషియా విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ జవాన్ విధి నిర్వహణలో మరణిస్తే.. మృతుడి భార్యకు, తల్లిదండ్రులకు సమానంగా ఎక్స్ గ్రేషియా పంపిణీ చేస్తామని తెలిపారు. ఇటీవలే మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పోలీస్ జవాన్ వీరమరణం పొందారు. కాగా.. మృతుడి కుటుంబానికి రూ.కోటి ఎక్స్ గ్రేషియా(Ex gratia) వచ్చింది. మృతుడి భార్య, తల్లిదండ్రలకు చెరిసమానంగా నిధులు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవలే దివంగత ఆర్మీ అధికారి కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్యకు, తల్లిదండ్రులకు మధ్య ఎక్స్ గ్రేషియా విషయంలో వివాదం తలెత్తింది. భర్త మరణించాక అత్తిల్లు వదిలిపెట్టి వెళ్లినట్లు కెప్టెన్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఎన్ఓకే నిబంధనలు సవరించాలని వారు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రాముఖ్యతను సంతరించుకుంది.


Similar News