Journalist : సీపీఎం నేతపై మహిళా జర్నలిస్టు సంచలన ఆరోపణలు

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్‌(Bengal)కు చెందిన సీపీఎం(CPM) నేత తన్మయ్ భట్టాచార్యపై ఒక మహిళా జర్నలిస్టు(Journalist) సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2024-10-27 19:04 GMT
Journalist : సీపీఎం నేతపై మహిళా జర్నలిస్టు సంచలన ఆరోపణలు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్‌(Bengal)కు చెందిన సీపీఎం(CPM) నేత తన్మయ్ భట్టాచార్యపై ఒక మహిళా జర్నలిస్టు(Journalist) సంచలన ఆరోపణలు చేశారు. ఒకటి, రెండుసార్లు ఇంటర్వ్యూ చేసేందుకు ఇంటికి వెళ్లగా.. తన్మయ్ భట్టాచార్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. రెండోసారి అతడితో ఫేస్‌బుక్ లైవ్ చేసే క్రమంలో అతిగా ప్రవర్తించాడని సదరు మహిళా జర్నలిస్టు మండిపడ్డారు.

‘‘కొంచెం అటూఇటుగా జరిగి కూర్చొమ్మని మా కెమెరాపర్సన్ చెప్పిన వెంటనే.. తన్మయ్ భట్టాచార్య మొత్తంగా జరిగిపోయి నా ఒడిలో కూర్చున్నాడు’’ అని ఆమె తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. దీనిపై తాను బారానగర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు కూడా చేశానని వెల్లడించారు. మహిళా జర్నలిస్టు ఆరోపణలపై స్పందించిన సీపీఎం.. తన్మయ్ భట్టాచార్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించింది. అతడి వ్యవహార శైలిపై పార్టీలో అంతర్గతంగా దర్యాప్తు చేయిస్తామని తెలిపింది.

Tags:    

Similar News