Video Viral:‘చిన్న హృదయాలు.. గొప్ప ఆలోచన’.. తమ స్నేహితుడి కోసం ఏం చేశారో చూడండి!
ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మంది పరిచయం అవుతునే ఉంటారు.

దిశ,వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మంది పరిచయం అవుతునే ఉంటారు. కానీ చొరవ కొందరితోనే ఉంటుంది. ఈ క్రమంలో మీ గురించి నిస్వార్థంగా ఆలోచించేవారే మీ నిజమైన స్నేహితులు. ఈ ప్రపంచమంతా ఏకమై మిమ్మల్ని ఒంటరిని చేసిన సరే వారు మాత్రం మీ తరఫునే నిలుస్తారు. కష్టాల నుంచి గట్టెక్కించే మార్గం చూపుతారు. ఆలోచనల్లో, ఆచరణలో మీ వెన్నంటే ఉంటారు. అందుకే స్నేహం చాలా గొప్పదని, విలువైనదని అంటుంటారు పెద్దలు. ఇదిలా ఉంటే.. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో సంఘటనలు చూస్తూనే ఉన్నాం. కొన్ని మనసుకు హత్తుకునే ఘటనలు అందరి హృదయాలను కరిగించేస్తాయి. తాజాగా ఇలాంటి ఘటనే నేపాల్‌లో వెలుగు చూసింది.
వారంత స్కూల్ పిల్లలు.. వారి స్ఫూర్తి ఎంత గొప్పది అంటే తమతో రోజూ ఆడుకునే తోటి విద్యార్థిని కష్టం చూసి చలించిపోయారు. అతని కోసం ఏదైనా చేయాలని అనుకున్నారు. స్మాల్ హెవెన్ అనే స్కూల్‌లో పిక్నిక్ వెళుతున్నాం అని ఉపాధ్యాయులు విద్యార్థులకు చెప్పారు. ఈ క్రమంలో విద్యార్థులు కొంత డబ్బు అవసరం వచ్చింది. స్టూడెంట్స్ అందరూ మనీ ఇచ్చారు. కానీ ప్రిన్స్ అనే విద్యార్థి డబ్బులు ఇవ్వలేదు. ఇది గమనించిన తోటి విద్యార్థులు ఏం ఆలోచించకుండా తమ మిత్రుడి కోసం డబ్బును సేకరిస్తున్నారు. ఈ క్రమంలో కొంత డబ్బు జమ అయిన తర్వాత తమ డెస్క్‌లపై లెక్కించారు. ఇక ఆ డబ్బును తమ టీచర్ వద్దకు తీసుకువెళ్లారు.
టీచర్ దగ్గరకు వెళ్లి మా స్నేహితుడు కూడా పిక్నిక్‌కు వస్తాడని ఆ డబ్బులు అందజేశారు. ఈ చిన్నపిల్లల పెద్ద మనసుకు ముగ్ధులైన ఉపాధ్యాయురాలు ప్రిన్స్ ట్రిప్‌ను స్వయంగా స్పాన్సర్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ తరుణంలో పిల్లల డబ్బును వారికే అందజేసింది. ఇది చిన్న మొత్తమె కానీ వారి ఆలోచన గొప్పది. విద్యార్థులను చూడగానే బాధిత చిన్నారులు ఏడ్చిన తీరు అందరి హృదయాలని కలిచివేసింది. తన స్నేహితులు చూపిన ప్రేమకు ప్రిన్స్ తన కృతజ్ఞతగా వారికి ఐస్ క్రీం తినిపించాడు. అయితే ప్రిన్స్ తల్లిదండ్రులు పాఠశాల సమీపంలో జ్యూస్ స్టాల్ నడుపుతున్నారని, ఇది శీతాకాలం కోసం తాత్కాలికంగా మూసివేయబడిందని టీచర్ తెలిపారు.
ఈ హృదయాలను కదిలించే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో టీచర్ షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పిల్లల స్నేహ స్ఫూర్తి పట్ల టీచర్ ప్రశంసల వర్షం కురిపించింది. "ఈ రోజు స్నేహాన్ని అత్యుత్తమంగా చూడటం నాకు చాలా హృదయపూర్వకంగా ఉంది. ఈ చిన్ని హృదయాలు ఒకరికొకరు సహాయం చేసుకోవడం మనం మానవులుగా చేయగలిగే ఉత్తమమైన వాటిలో ఒకటి అని గుర్తు చేశాయి" అని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఆమె విద్యార్థుల స్వచ్ఛమైన మరియు అమాయక స్ఫూర్తిని కొనియాడారు. ఈ వీడియో వేల సంఖ్యలో లైక్‌లను, ప్రశంసలను అందుకుంటుంది.