పాపం.. ఈ బాతుకు చూడండి ఎంత కష్టమొచ్చిందో!
నెట్టింట నిత్యం ప్రపంచంలోని ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.

దిశ, వెబ్ డెస్క్: నెట్టింట నిత్యం ప్రపంచంలోని ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని.. ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇక వైరల్ అయ్యే ఈ వీడియోల్లో ఎక్కువగా జంతువులు, పక్షులు, పిల్లలకు సంబంధించినవే ఉంటాయి. ఈ వీడియోలు చూసి నెటిజన్లు సైతం ఎంజాయ్ చేస్తుంటారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ బాతు (Duck) వీడియో చూసి అయ్యో ఎంత కష్టమొచ్చిందని జాలి పడుతున్నారు.
సాధారణంగా బాతులు, హంసలను వాటర్‌ఫౌల్స్ అని పిలుస్తారు. ఎందుకంటే అవి సాధారణంగా చిత్తడి నేలలు, మహాసముద్రాలు, నదులు, చెరువులు, నీరు ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇక వైరల్ అవుతున్న వీడియోలో ఓ బాతు మంచు పర్వతం ప్రాంతంలో ఉంది. ఇక మంచు పర్వతాల్లో నీరు క్షణాల్లో ఎలా గడ్డ కడుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ బాతు ముక్కు కూడా నీటితో గడ్డ కట్టుకుపోయింది. పాపం.. దాని రెక్కలతో, కాళ్లతో విధిలించుకునేందుకు ఎంత ప్రయత్నించినా మంచు విడిపోవటం లేదు. చివరికి ఆ బాతుకి శరీర వేడికి అది కరుగుతుందని అర్థమవ్వటంతో దాని రెక్కల్లో ముక్కును దాచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను 'Moments that Matter' అనే ఎక్స్ ఖాతాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. ఇక ఇది చూసిన నెటిజన్లు అలా ఎలా గడ్డ కట్టింది, పాపం.. బాతు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Ducks thaw frozen beaks using body heat, a natural cold-weather trick. 🦆❄️ pic.twitter.com/CZF8x1Mrzk
— Moments that Matter (@_fluxfeeds) March 27, 2025