Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా గెలవదు: ఫడ్నవీస్

బీజేపీ ఒంటరిగా గెలవదని, అయితే ఎన్నికల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అన్నారు.

Update: 2024-10-27 19:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్  కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా గెలవదని, అయితే ఎన్నికల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అన్నారు. ఆదివారం జాతీయ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. గ్రౌండ్ రియాలిటీ పరిస్థితుల గురించి సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. మహాయుతి కూటమిలో ఉన్న బీజేపీ, సీఎం ఏక్‌నాథ్ షిండెకు చెందిన శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ కలిసి విజయం దక్కించుకుంటాయన్నారు. 'బీజేపీ ఒక్కటే రాష్ట్రాన్ని గెలవదు కానీ మాకు అత్యధిక సీట్లు, అత్యధిక ఓటింగ్ శాతం ఉన్నాయనేది నిజం. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, మూడు పార్టీల ఓట్లను ఏకీకృతం చేస్తేనే విజయం సాధిస్తామని' అన్నారు. ఇదే సమయంలో టిక్కెట్లు దక్కని కొందరు బీజేపీ నేతల నిరాశ, వారు తిరుగుబాటు చేసే అవకాశాల గురించి స్పందిస్తూ.. కొందరికి టికెట్లు దక్కకపోవడం కొంత బాధించే అంశమే. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు సినిమాల్లో కొత్త ఆర్టిస్టులకు కూడా ప్రధాన పాత్ర పోషించే విధంగా ఉందని సరదాగా చెప్పుకొచ్చారు. కాగా, రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా, బీజేపీ ఇప్పటివరకు 121 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. 

Tags:    

Similar News