లోక్ సభ స్పీకర్ పదవిపై వీడని ఉత్కంఠ.. రాజ్ నాథ్ నివాసంలో కీలక భేటీ
పార్లమెంట్ సమావేశాల ముందు లోక్‌సభ స్పీకర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి టైంలో సాయంత్రం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసంలో మంత్రుల సమావేశం జరగనుంది.
దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్ సమావేశాల ముందు లోక్‌సభ స్పీకర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి టైంలో సాయంత్రం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసంలో మంత్రుల సమావేశం జరగనుంది. జూన్ 24న స్పీకర్ ఎన్నిక కోసం లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. దీంతో, ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో స్పీకర్ ఎన్నికతో పాటు పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీఏ పక్షాల మధ్య సమన్వయానికి చేపట్టాల్సిన చర్యలపై భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లోక్‌సభ స్పీకర్ పదవిని ఎన్డీయే కీలక భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీ(యూ) ఆశిస్తున్నాయి. లోక్‌సభ స్పీకర్‌గా ఎవరివైపు ఎన్డీయే మొగ్గుచూపుతుందనే ఈ భేటీ తర్వాత తెలియనుంది.
రాజ్ నాథ్ సింగ్ పైనే బాధ్యత..
స్పీకర్ పదవిపై ఎన్డీయే పక్షాలతో పాటు విపక్షాల నుంచి ఏకాబిప్రాయాన్ని తీసుకొచ్చే బాధ్యతను హైకమాండ్ రాజ్ నాథ్ సింగ్ కు అప్పగించింది. జూన్ 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇలాంటి టైంలో లోక్ సభ స్పీకర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. కాగా.. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి కీలక నేతలకు స్పీకర్ పదవి దక్కే ఛాన్స్ ఉందిని బీజేపీ వర్గాలు తెలిపాయి. డి. పురందేశ్వరి, భత్రుహరి మహతాబ్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కేరళకు చెందిన ఎంపీ కే సురేష్ ను ప్రొటెం స్పీకర్ గా నియమించింది.