రియాసి ఉగ్రదాడిలో టెర్రరిస్టులకు సాయం చేసిన వ్యక్తి అరెస్ట్

జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేసిన ఉగ్రవాదులకు సహాయం చేసినందుకు గాను రాజౌరిలో హకమ్ (45) అనే కార్మికుడిని అరెస్టు చేశారు.

Update: 2024-06-19 14:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేసిన ఉగ్రవాదులకు సహాయం చేసినందుకు గాను రాజౌరిలో హకమ్ (45) అనే కార్మికుడిని అరెస్ట్ చేశారు. ఇతను ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం అందించడంతో పాటు దాడి చేయడానికి గైడ్‌గా కూడా వ్యవహరించాడు. రియాసీ సీనియర్ ఎస్పీ మాట్లాడుతూ, సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత తమ దర్యాప్తులో ఒక పెద్ద పురోగతి లభించిందని, ఈ కేసుపై తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మాతా వైష్ణో దేవి మందిరానికి యాత్రికులను తీసుకెళ్తున్న బస్సుపై జూన్ 9న జరిగిన దాడిలో తొమ్మిది మంది మరణించగా, 41 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బస్సు లోతైన లోయలోకి పడిపోయింది.


Similar News