రూ.90 నాణెంను విడుదల చేసిన ఆర్బీఐ..దీని ప్రత్యేకత ఏంటంటే?

ఏప్రిల్ 1వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా రూ.90 నాణెం తయారు చేసింది.ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు.

Update: 2024-04-02 08:33 GMT

దిశ,ప్రతినిధి:ఏప్రిల్ 1వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా రూ.90 నాణెం తయారు చేసింది.ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌,ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తదితరులు పాల్గొన్నారు.ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆవిష్కరించిన రూ.90 నాణెం 99.99 శాతం స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు.ఈ నాణెం బరువు 40 గ్రాములు. స్వచ్ఛమైన వెండితో తయారు చేసిన ఈ 40 గ్రాముల నాణెం రూ. 90 ముఖ విలువతో RBI చిహ్నంగా ఉంటుంది.లోగో కింద RBI@90 అని రాసి ఉంది.అశోక స్తంభానికి నాలుగు సింహాల చిహ్నం ఉంది. దాని కింద దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అని రాసి ఉంది.ఈ రూ.90 నాణెం ఒక ప్రత్యేక రోజు జ్ఞాపకార్థం ముద్రించబడింది.ఇది ప్రజల వినియోగానికి అందుబాటులో ఉండే అవకాశం లేదు.


Similar News