మరో హెల్త్‌ ఎమర్జెన్సీని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధం కావాలి : ప్రధాని మోడీ

కరోనా లాంటి మరో హెల్త్‌ ఎమర్జెన్సీ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సమాయత్తమై ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

Update: 2023-08-18 14:03 GMT

న్యూఢిల్లీ : కరోనా లాంటి మరో హెల్త్‌ ఎమర్జెన్సీ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సమాయత్తమై ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆరోగ్య అంశాల్లో ప్రపంచ దేశాలు ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని కరోనా మహమ్మారి గుర్తు చేసిందన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శుక్రవారం జరిగిన జీ20 దేశాల ఆరోగ్య మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు.

ఆరోగ్య విపత్తులు తలెత్తినప్పుడు వైద్య, సాంకేతిక ఆవిష్కరణల కోసం ప్రపంచ దేశాలు వేటికవిగా పరిశోధనలు చేయడం కంటే.. కలిసికట్టుగా గ్లోబల్ ఇనిషియేటివ్‌ ప్రాజెక్టులను చేపట్టడం వల్ల నిధుల దుబారాకు చెక్ పెట్టొచ్చని సూచించారు. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు నిర్దేశించిన గడువు (2030 సంవత్సరం) కంటే ముందే క్షయ (టీబీ) వ్యాధిని భారత్ నిర్మూలిస్తుందన్నారు.


Similar News