బాంబు బెదిరింపులన్నీ ఆకతాయి పనులు: పౌర విమానయాన మంత్రి

వీటి వెనుక కుట్రలు ఉన్నాయనే ఊహాగానాలపై వ్యాఖ్యానించలేము.

Update: 2024-10-17 19:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత ఎయిర్‌లైన్ సంస్థలకు చెందిన పలు విమానాలకు వరుసగా నాలుగు రోజుల నుంచి బాంబు బెదిరింపులు రావడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్‌మోహన్ నాయుడు కింజారపు స్పందించారు. గురువారం కూడా బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో వాటిపై చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇవన్నీ చిన్న చిన్న సంఘటనలని అన్నారు. వీటి వెనుక కుట్రలు ఉన్నాయనే ఊహాగానాలపై వ్యాఖ్యానించలేము. ఇప్పటివరకు జరిగిన సంఘటనల్లో కొంతమంది మైనర్లు, ఆకతాయిల నుంచి వస్తున్నాయి. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం గురించి చర్చిస్తున్నామని, మంత్రిత్వ శాఖలోని విమానయాన సంస్థలు, భద్రతా సంస్థలతో కూడా మాట్లాడుతున్నామని మంత్రి వెల్లడించారు. గురువారం రెండు అంతర్జాతీయ విమానాలతో పాటు విస్తారా, ఇండిగోకు చెందిన దేశీయ కంపెనీలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 

Tags:    

Similar News