Mohan Bhagwat: శత్రు దేశాలకూ భారత్ సాయం .. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

ఒకప్పుడు తమకు వ్యతిరేకంగా యుద్ధం చేసిన దేశాలకు సైతం భారతదేశం సహాయం చేస్తుందని అన్నారు.

Update: 2024-10-17 18:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఒకప్పుడు తమకు వ్యతిరేకంగా యుద్ధం చేసిన దేశాలకు సైతం భారతదేశం సహాయం చేస్తుందని అన్నారు. పూర్వీకులు నిర్దేశించిన సూత్రాలను పాటిస్తూనే ఈ సాయం చేస్తుందని తెలిపారు. సూరత్‌లో జైన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గతంలో భారత్‌కు విరుద్దంగా వ్యవహరించిన దేశాలు ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నాయి. కానీ వాటికి భారత్ మద్దతిస్తుందని తెలిపారు. భారత్ ఎటువంటి దాడులు చేయబోదని, అలాగే తనపై ఎవరైనా అటాక్ చేసినా సహించబోదని స్పష్టం చేశారు. 1999లో కార్గిల్‌లో పాకిస్థాన్ దుశ్చర్యకు పాల్పడినందుకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం భారత్‌కు ఉందని, అయితే సరిహద్దు దాటి దాడి చేయొద్దని సైన్యాన్ని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిపారు. దేశ ప్రజలకు ప్రతి సమస్యనూ పరిష్కరించే సామర్థ్యం ఉందని నొక్కి చెప్పారు. భారత్ నుంచి ప్రపంచం ప్రేరణ పొందుతుందని కొనియడారు.


Similar News