Bihar: మద్య నిషేధం ప్రభుత్వ ఫైళ్లలో మాత్రమే ఉంది: ప్రశాంత్ కిషోర్

ప్రభుత్వ ఫైళ్లు, రాజకీయ ప్రసంగాలలో మాత్రమే నిషేధం అమలవుతోందని ఎద్దేవా చేశారు.

Update: 2024-10-17 19:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్‌ రాష్ట్రంలో కల్తీ మద్యం కారణంగా మరణించిన వారి సంఖ్య 25కి చేరింది. దీనిపై జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా మద్యం నిషేధించలేదు. ప్రభుత్వ ఫైళ్లు, రాజకీయ ప్రసంగాలలో మాత్రమే నిషేధం అమలవుతోందని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని తాను మూడేళ్ల నుంచి ప్రతి వేదికపైనా చెబుతూనే ఉన్నాను. బుధవారం జరిగిన ఘటన అత్యంత విచారకరమైనది. గడిచిన ఏడాదిన్నర కాలంలో ఛప్రాలో 70 మందికి పైగా మృతి చెందారు. విషపూరిత మద్యం వల్ల మరణించని జిల్లా అంటూ రాష్ట్రంలో లేదు. అనేక ఘటనలను వెలుగులోకి రాకుండా, నేతలు, మాఫియా వర్గాలు లబ్ది పొందుతున్నాయి. ప్రభుత్వం వారిపట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, ఇన్ని మరణాలు సంభవిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బాధిత ప్రాంతాలను సందర్శించడంలేదని పీకే విమర్శించారు. కాగా, బుధవారం జరిగిన ఘటనకు సంబంధించి 12 మందిని అరెస్ట్ చేసినట్టు రాష్ట్ర డీజీపీ ధృవీకరించారు.

Tags:    

Similar News