S Jaishankar: ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు అత్యంత కీలకం- జైశంకర్

వాణిజ్య ఒప్పందాల ప్రాముఖ్యతపై విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ (S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. బిజినెట్ టుడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

Update: 2025-03-23 11:39 GMT
S Jaishankar: ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు అత్యంత కీలకం- జైశంకర్
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: వాణిజ్య ఒప్పందాల ప్రాముఖ్యతపై విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ (S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. బిజినెట్ టుడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు అత్యంత కీలకమైనవి. ప్రస్తుత కాలంలో వీటి ప్రాధాన్యం బాగా పెరిగిపోయింది. ఈ వాస్తవాన్ని భారత్‌ గుర్తించాలి. ప్రస్తుతం భారత్ మూడు అత్యంత కీలక వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోంది. ఐరోపా సమాఖ్య, యూకేతో ఎఫ్‌టీఏ, అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాం. ఈ వారమే న్యూజిలాండ్‌తో కూడా వాణిజ్య ఒప్పందంపై చర్చలను ప్రారంభించాం. మరికొన్ని కూడా ప్రాసెస్‌లో ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచమంతా అనిశ్చితి, అస్థిరతో కొట్టుమిట్టాడుతూంటే ఇలాంటి ప్రయత్నాలను అభినందించాలన్నారు. అంతేకకుండా, ఈ క్రమంలో వాటి నుంచి వచ్చే లాభాలను జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలన్నారు. చర్యలు తీసుకోవడం లేదా తీసుకోకపోవడంతో ప్రయోజనాలను లెక్కవేసుకోవాలన్నారు. సున్నితమైన సాంకేతికత విషయంలో అటువంటి ఒప్పందాలతో ఇరు పక్షాలకు ప్రయోజనాలు లభించే అవకాశం ఉందని చెప్పారు.

భారత్ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం

భారత్‌ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం అనే విధానానికి ఇక నుంచి అనుసరిస్తామని జైశంకర్‌ వెల్లడించారు. గతంలో చాలా వరకు ఆసియాన్‌ దేశాలతోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకొన్నట్లు వెల్లడించారు. ఈ దేశాలతో వాణిజ్యం పోటాపోటీగా జరిగిందని.. కానీ, గల్ఫ్‌, పశ్చిమ దేశాలతో చేసుకొన్న ఒప్పందాల్లో మాత్రం మిగులు సాధించినట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలను బెదిరించిన తర్వాత, దేశ ప్రయోజనాలను అగ్రస్థానంలో ఉంచుంతామని కేంద్రం పునరుద్ఘాటించింది. దీనిపైన చర్చలు జరుగుతున్నాయని హామీ ఇచ్చింది.

Tags:    

Similar News