MLA Suspended : పార్టీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ బహిష్కరణ
బీజేపీ(BJP) నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేను బహిష్కరిస్తూ(MLA Suspended) కీలక నిర్ణయం తీసుకుంది అధిష్టానం.

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ(BJP) నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేను బహిష్కరిస్తూ(MLA Suspended) కీలక నిర్ణయం తీసుకుంది అధిష్టానం. కర్ణాటక(Karnataka)లోని విజయపుర సిటీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్(MLA Basanagouda Patil Yatnal) ను పార్టీ నుంచి 6 సంవత్సరాల పాటు బహిష్కరిస్తూ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ ప్రకటన విడుదల చేసింది. యత్నాళ్ పదేపదే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం, రాష్ట్ర స్థాయి నాయకత్వంపై విమర్శలు చేయడం కారణాలుగా తెలుస్తున్నాయి. అంతేకాదు ఇటీవల అక్రమ బంగారం కేసు(Gold Smuggling Case)లో అరెస్ట్ అయిన నటి రన్యా రావు(Actor RanyaRao)పై యత్నాళ్ తీవ్ర అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. గతంలో బీజేపీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ తీసుకున్నప్పటికీ.. యత్నాళ్ తన వైఖరిని మార్చుకోలేదని పార్టీ ఆరోపించింది.
అలాగే గత నవంబర్ లో బీదర్‌లో యత్నాళ్ ప్రారంభించిన 'ఆంటీ-వక్ఫ్' మార్చ్ కూడా వివాదాస్పదంగా మారింది. ఈ కార్యక్రమం పార్టీ వైఖరికి విరుద్ధంగా ఉందని బీజేపీ నాయకత్వం భావించింది. ఈ సంఘటనలు అన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయనపై బహిష్కరణ వేటు వేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై యత్నాళ్ స్పందిస్తూ.. తన హిందుత్వ అజెండా, అవినీతి వ్యతిరేక పోరాటం, వక్ఫ్ సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. ఆయన తన స్వతంత్ర రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తారా లేక ఇతర పార్టీలతో జట్టు కడతారా అనేది కన్నడనాట తీవ్ర చర్చకు దారి తీసింది.