మద్దతు ఇవ్వడానికి మేము ఇప్పటికీ సిద్దమే!.. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కీలక వ్యాఖ్యలు

స్పీకర్ ఎన్నిక అంశంలో గత సాంప్రదాయాన్ని పాటించడానికి మేము సిద్దంగా ఉన్నామని, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు.

Update: 2024-06-25 09:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: స్పీకర్ ఎన్నిక అంశంలో గత సాంప్రదాయాన్ని పాటించడానికి మేము సిద్దంగా ఉన్నామని, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. స్పీకర్ పదవి వివాదంపై పార్లమెంట్ లో మీడియాతో మాట్లాడుతూ.. నిన్న ప్రధాన మంత్రి మోడీ లోక్ సభ, రాజ్యసభలు సజావుగా జరగడానికి ఏకాభిప్రాయం ముఖ్యం అని చెప్పారని, దానికి మేము కూడా సిద్దంగా ఉన్నామని ఇవ్వాళ రాహుల్ గాంధీ చెప్పినట్లు తెలిపారు. గవర్నమెంట్ నుంచి సూచించిన స్పీకర్ కు మద్దతు ఇవ్వాడానికి మేము సిద్దంగా ఉన్నామని, అలాగే వారు కూడా ప్రతిపక్షాలను గౌరవిస్తే బాగుంటుందని హితవు పలికారు.

స్పీకర్ ప్రభుత్వం నుంచి, డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాల నుంచి ఉండటం గత కొన్నేళ్లు గా చూస్తున్నామని, యూపీఏ అదికారంలో ఉన్న పది సంవత్సరాలలో కూడా డిప్యూటీ స్పీకర్ పదవి ఎన్డీఏ కు కేటాయించామని గుర్తుచేశారు. అందులో భాగంగానే లోక్ సభ సాంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగానే మల్లికార్జున ఖర్గేను రాజ్ నాధ్ సింగ్ వచ్చి కలిశారని, స్పీకర్ పదవికి మద్దతు కావాలని కోరారని తెలిపారు. ఖర్గే గారు కూడా లోక్ సభ సాంప్రదాయం ప్రకారం స్పీకర్ ప్రభుత్వం నుంచే ఎన్నుకోబడతారు.

కాబట్టి మేమే దానికి మద్దత్తు ఇస్తామని, అదే సాంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని కోరితే.. రాజ్ నాధ్ సింగ్ మా అధిష్టానంతో మాట్లాడతామని సమాధానం ఇచ్చినట్లు వేణుగోపాల్ తెలిపారు. అలాగే ఇవ్వాళ ఉదయం కూడా వచ్చి కలిశారని డిప్యూటీ స్పీకర్ పదవి గురించి అడిగితే పీఎం మోడీని చర్చించి చెబుతామన్నారు. అనంతరం తనను రాజ్ నాధ్ సింగ్ రూం కి పిలిచి స్పీకర్ పదవికి ప్రపోజ్ చేస్తున్నట్లు సంతకం చేయమన్నారని, కానీ డిప్యూటీ స్పీ్కర్ పదవి పై తేల్చనిదే.. తాము సంతకం చేయనని చెప్పినట్లు తెలిపాడు. ప్రభుత్వం పిలుపు కోసం ఇప్పటికీ మేము వేచి ఉన్నామని, డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాలకు ఇస్తే.. మేము మద్దతు ఇవ్వాడానికి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.



Similar News