ముంబైలో వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముంబైకి వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

Update: 2024-07-14 07:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముంబైకి వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మహారాష్ట్రలోని సతారా, కొల్హాపూర్, సింధుదుర్గ్, రత్నగిరి ప్రాంతాలకు కూడా రెడ్ అలెర్ట్ జారీ చేసింది. శనివారం అర్థరాత్రి ముంబైలో భారీ వర్షం పడింది. వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే, ముంబై విమానాశ్రయం, అంధేరి సబ్ వే సహా కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ముంబై విమానాశ్రయం గేట్ నంబర్ 8 చుట్టూ నీరు నిలిచిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. రోడ్లపైన భారీగా వరద నిలవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయ్యింది. కొన్నిచోట్ల ఇళ్లల్లోకి వరద నీరు పోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగింది. ఆదివారం సాయంత్రం 4:39 గంటలకు 3.69 మీటర్ల ఎత్తు వరకు అలలు పోటెత్తుతాయని అధికారులు హెచ్చరించారు. గరిష్ఠంగా 29 డిగ్రీలు, కనిష్ఠంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని తెలిపారు.


Similar News