హర్యానా, జమ్మూకశ్మీర్‌లో మొదలైన ఓట్ల లెక్కింపు
హర్యానా, జమ్మూకశ్మీర్‌లలో ఓట్ల లెక్కింపు మొదలైంది. మూడంచెల కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ మొదలైంది.
దిశ, వెబ్‌డెస్క్: హర్యానా, జమ్మూకశ్మీర్‌లలో ఓట్ల లెక్కింపు మొదలైంది. మూడంచెల కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ మొదలైంది. కాగా.. మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు. ఇక జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగ్గా.. మ్యాజిక్ ఫిగర్ 48 సీట్లుగా ఉంది. ఇక హర్యానాలో కూడా 90 అసెంబ్లీ స్థానాలుండగా.. 46 సీట్లలో విజయం సాధించిన పార్టీ అధికారం దక్కించుకోనుంది. ఇదిలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. హర్యానాలో కాంగ్రెస్‌కే గెలుపు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ.. బీజేపీ మాత్రం తామే హ్యాట్రిక్ కొడతామంటూ ధీమాగా ఉన్నాయి. ఇక జమ్మూ కశ్మీర్‌లో గాలి కొద్దిగా బీజేపీకి మొగ్గు చూపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా.. అక్టోబర్ 5న ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ముగిశాయి.