ఫోన్‌‌లో మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్‌ చేసిన పోలీస్.. వెంటనే ట్రాన్స్ ఫర్

ముఖ్యమంత్రి ముందు ఓ పోలీసు అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.

Update: 2023-08-18 10:48 GMT

డెహ్రాడూన్: ముఖ్యమంత్రి ముందు ఓ పోలీసు అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఫోన్‌లో మాట్లాడుతూ సెల్యూట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో ఉన్నతాధికారులు అతడిని వెంటనే మరోచోటుకు ట్రాన్స్ ఫర్ చేశారు. ఉత్తరాఖండ్‌లోని గ్రాస్తాన్‌గంజ్‌‌లో ఆగస్టు 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి కోట్‌ద్వార్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడానికి హరిద్వార్‌ నుంచి గ్రాస్తాన్‌గంజ్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) శేఖర్‌ సుయాల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ.. సీఎంకు సెల్యూట్ చేశారు. ఇలా చేసినందుకు ఏఎస్పీని నరేంద్ర నగర్‌లోని పోలీసు శిక్షణా కేంద్రానికి బదిలీ చేశారు.


Similar News