డిసెంబర్ కల్లా వందే మెట్రో: అశ్విని వైష్ణోయ్

దేశంలో వందే భారత్ ట్రైన్లు అందుబాటులోకి వచ్చిన తరుణంలో తక్కువ దూరంలోని నగరాలను అనుసంధానం చేసేందుకు నూతన రైలు సేవలను తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణోయ్ తెలిపారు..

Update: 2023-04-14 12:36 GMT

న్యూఢిల్లీ: దేశంలో వందే భారత్ ట్రైన్లు అందుబాటులోకి వచ్చిన తరుణంలో తక్కువ దూరంలోని నగరాలను అనుసంధానం చేసేందుకు నూతన రైలు సేవలను తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణోయ్ తెలిపారు. వందే మెట్రో పేరుతో త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. డిసెంబర్ కల్లా అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. ప్రధాన నగరాల నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర నగరాలకు ప్రజలకు అందుబాటులో ఈ రైళ్లు నడుస్తాయని చెప్పారు. అయితే ఇవి వందే భారత్ ట్రైన్లతో పోలిస్తే భిన్నమని అన్నారు. ‘వందే భారత్‌తో పోలిస్తే వందే మెట్రో భిన్నం. ఇది రోజులో నాలుగైదు సార్లు సేవలు అందించేలా ఎక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి. 100 కిలోమీటర్ల దూరంలోని నగరాల మధ్య ఇవి నడుస్తాయి. డిసెంబర్ కల్లా అందుబాటులోకి తీసుకొస్తాం’ అని తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రధాని మోడీ తమకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు చెప్పారు.

Tags:    

Similar News