Uttar Pradesh: న్యాయమూర్తి పెంపుడు కుక్క చోరీ.. 12 మందిపై కేసు నమోదు
Uttar Pradesh: Judge's pet dog stolen.. Case registered against 12 people
దిశ, వెబ్‌డెస్క్: డవివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం ఓ జడ్జి కుటుంబానికి, పక్కింట్లో అహ్మద్ అనే వ్యక్తి కుటుంబానికి మధ్య కుక్క విషయంలో తీవ్ర వివాదం తలెత్తింది. అదే కాలనీలో ఉంటున్న అహ్మద్ కుమారుడు ఖాదిర్ ఖాన్ న్యాయమూర్తి కుటుంబాన్ని చంపేస్తానంటూ బెదిరించాడు. అయితే, మే 16న ఇరు కుటుంబాల మధ్య మరోసారి పంచాయితీ జరిగింది. ఆ శునకం తనపై, తన కూతురిపై దాడి చేసిందని అహ్మద్ భార్య జడ్జీ ఫ్యామిలీతో గొడవకు దిగింది. ఇంతలోనే ఇంట్లోని కుక్క మాయం అవ్వడంతో జడ్జీ ఫోన్ ద్వారా బరేలీ పోలీసులకు సమాచారం అందజేశాడు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అహ్మద్ కుటుంబంలోని 12 మందిపై జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు కుక్క కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే, ఘటనపై వ్యాఖ్యానించేందుకు న్యాయమూర్తి కుటుంబం నిరాకరించింది. సదరు న్యాయమూర్తి హర్దోయ్‌లో విధులు నిర్వర్తిస్తున్నట్లుగా తెలుస్తోంది.