మరో అనుమానిత వస్తువును కూల్చిన అమెరికా
చైనా స్పై బెలూన్ అనుమానిత ఆందోళన కదలికల మధ్య అమెరికా గగనతలంలో మరింత నిఘా పెంచింది. అలాస్కా గగనతలంతో 40వేల అడుగుల ఎత్తులో అనుమానం ఉన్న వస్తువును కూల్చివేశారు
వాషింగ్టన్: చైనా స్పై బెలూన్ అనుమానిత ఆందోళన కదలికల మధ్య అమెరికా గగనతలంలో మరింత నిఘా పెంచింది. అలాస్కా గగనతలంతో 40వేల అడుగుల ఎత్తులో అనుమానం ఉన్న వస్తువును కూల్చివేశారు. ఈ విషయాన్ని జాతీయ భద్రత మండలి ప్రతినధి జాన్ కిర్బీ తెలిపారు. ఆకాశంలో విమాన మార్గంలో కొత్త వస్తువును గుర్తించామని యుద్ధ విమానం సమయంతో కూల్చివేసినట్లు చెప్పారు. పౌర విమానయానానికి అడ్డంకిగా మారడంతో, అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కూల్చివేత ప్రక్రియ విజయవంతమైనట్లు తెలిపారు. గత వారం కూల్చివేసిన చైనా స్పై బెలూన్ చిన్న కారు సైజులో ఉందని అన్నారు. అయితే తాజా వస్తువు ప్రభుత్వానిదా, కార్పోరేట్ వ్యవస్థలదా అనే విషయం తెలియదని చెప్పారు.