UPSC: ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా..!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేశారు. "వ్యక్తిగత కారణాల" కారణంగా రాజీనామా చేశారు.

Update: 2024-07-20 04:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) చైర్‌పర్సన్ మనోజ్ సోనీ రాజీనామా చేశారు. "వ్యక్తిగత కారణాల" కారణంగా రాజీనామా చేశారు. 2029లో ఆయన పదవీకాలం ముగియనుంది. కాగా.. ఐదేళ్ల ముందే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన రాజీనామాను ఇంకా అంగీకరించలేదని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ అధికారులు తెలిపారు. 2017 నుంచి యూపీఎస్సీలో సోనీ స‌భ్యుడిగా ఉన్నారు. 2023, మే 16వ తేదీన యూపీఎస్సీ ఛైర్మన్ గా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. యూపీఎస్సీ క‌న్నా ముందు ఆయ‌న మూడుసార్లు వైస్ ఛాన్స‌ల‌ర్‌గా పని చేశారు. డాక్ట‌ర్ అంబేద్క‌ర్ ఓపెన్ వ‌ర్సిటీలో రెండు సార్లు, బ‌రోడాలోని మ‌హారాజా స‌య్యాజీరావు యూనివ‌ర్సిటీకి ఓసారి వీసీగా చేశారు. మరోవైపు, ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్ కర్ కు సంబంధించిన వివాదానికి, ఈ రాజీనామాకు లింకులు లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. పూజా ఎంపిక నకిలీ ధ్రువపత్రాలు సమర్పించడం వల్లే జరిగిందని పేర్కొన్నాయి. చాన్నాళ్ల క్రితమే సోనీ రాజీనామా స‌మ‌ర్పించిన‌ట్లు తెలుస్తోంది.


Similar News