నిర్మాణ్ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు సమావేశాల అనంతరం.. నిర్మాణ్ పోర్టల్‌ను ప్రారంభించారు.

Update: 2024-07-02 15:19 GMT

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు సమావేశాల అనంతరం.. నిర్మాణ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ బొగ్గు గనులున్న ప్రాంతాల్లో సివిల్స్‌కు సన్నద్దమయ్యే అభ్యర్థులకు ఆసరాగా నిలవనుంది. ఈ నిర్మాణ్ పోర్టల్ ద్వారా సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహకం అందించనున్నారు. అర్హత గల అభ్యర్థులకు మాత్రమే ప్రోత్సాహకం అందేలా పారదర్శకత కోసం ఈ నిర్మాణ్ పోర్టల్ తీసుకొచ్చామని.. ప్రధాన మంత్రి కర్మయోగి ప్రేరణతోనే ఈ నిర్మాణ్ పోర్టల్ కు శ్రీకారం చుట్టామని.. UPSC పరీక్ష లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన విద్యార్థులకు ఒక లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. బొగ్గు గనులున్న 39 జిల్లాల్లో UPSC పరీక్షలకు ఆర్థికంగా వెనుకబడిన వర్గం కుటుంబాల ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Similar News