కొలెస్ట్రాల్ మేనేజ్ మెంట్ కోసం మార్గదర్శకాలు విడుదల చేసిన సీఎస్ఐ

కొలెస్ట్రాల్ మేనేజ్ మెంట్ కోసం మార్గదర్శకాలు విడుదలయ్యాయి. కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్ఐ) గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది.

Update: 2024-07-04 18:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కొలెస్ట్రాల్ మేనేజ్ మెంట్ కోసం మార్గదర్శకాలు విడుదలయ్యాయి. కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్ఐ) గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది. 22 మంది సభ్యుల కమిటీ ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్డియాలజిస్టులు యూరోపియన్ సొసైటీ ఆఫ్ ఇండియా 2019లో విడుదల చేసిన మార్గదర్శకాలే పాటిస్తుంది. కాగా.. సీఎస్ఐ ఇప్పుడు తొలిసారిగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కొత్తమార్గదర్శకాల ప్రకారం వ్యక్తి చికిత్స, చక్కెర స్థాయిల అంచనా కోసం నాన్ ఫాస్టింగ్ రిపోర్టులనే పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. అధిక కొలెస్ట్రాల్ అనేది సెలెంట్ కిల్లర్ అన్న వైద్యులు.. కొలెస్ట్రాల్ స్థాయిలు 70 mg/dl కన్నా మించవద్దని హెచ్చరించాయి. 18 ఏళ్లు దాటగానే.. తొలిసారిగా లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలని వైద్యులు అభిప్రాయపడ్డారు. 20 ఏళ్లుక పైగా మధుమేహం ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్ మరింత ప్రమాదకరం అని తెలిపారు. అధిక చక్కెర, కార్బోహైడ్రేట్ స్థాయిలతో కూడిన ఆహారం కన్నా పరిమిత స్థాయిలో కొవ్వు తీసుకోవడం ఉత్తమని వైద్యులు తెలిపారు. ఒక వ్యక్తికి 2 సంవత్సరాలలోపు అథిరోస్ల్కీరోసిస్ పునరావృతమైతే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని వెల్లడించారు.


Similar News