జుమ్ముకశ్మీర్ లో వరుస దాడుల వెనుక మెస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హస్తం

జమ్ము కశ్మీర్‌లో జరుగుతున్న దాడుల వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలిపింది.

Update: 2024-07-07 09:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ము కశ్మీర్‌లో జరుగుతున్న దాడుల వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలిపింది. లష్కరే తోయిబాకు చెందిన సైఫుల్లా సాజిద్ జట్ ప్రమేయం ఉందని పేర్కొంది. సాజిద్.. పాకిస్థాన్ కసూర్ జిల్లా శంగమంగ గ్రామానికి చెందిన వాడని గుర్తించింది. అతని తలపై రూ.10 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపింది. పాక్ రాజధాని ఇస్లామాద్ లోని బేస్ క్యాంప్ లో అతడు పనిచేస్తున్నట్లు సమాచారం. అతడితో పాటు భారత సంతతికి చెందిన భార్య ఉంటుందని తెలుస్తోంది. సాజిద్ ఇంతకుముందు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పనిచేశాడని.. ప్రస్తుతం లష్కరే తోయిబాలో రిక్రూట్‌మెంట్‌ను నిర్వహిస్తున్నాడు. ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించడానికి అతడే సహాయం చేస్తున్నాడని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.

రియాసీ ఘటనలో సాజిద్ ప్రమేయం

లష్కరే తొయిబాలో సాజిద్‌ ఆపరేషనల్ కమాండర్‌. దీంతో ఉగ్రవాదుల కోసం నిధులు సమకూర్చుతాడు. అంతేకాక, అతడు ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. కశ్మీర్ కు చెందిన ఖాసిం అనే వ్యక్తి అతడికి సాయం చేస్తున్నాడని ఎన్ఐఏ అనుమానిస్తుంది. ఖాసిం కోసం కూడా భద్రతాబలగాలు వెతుకుతున్నాయి. కొంతకాలంగా కశ్మీర్ లో జరుగుతున్న ఉగ్రదాడుల వెనుక సాజిద్ ప్రమేయం ఉందని తెలుస్తోంది. గత నెలలో రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆదాడిలో 9 మంది చనిపోయారు. ఆ తర్వాత జరిగిన మరో ఉగ్రదాడిలో ఇద్దరు టెర్రరిస్టులు, ఒక జవాన్ చనిపోయాడు. గత రెండ్రోజులుగా కుల్గాం జిల్లాలో ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఐదుగురు టెర్రరిస్టులు, ఒక పారాట్రూపర్ సహా ఇద్దరు జవాన్లు చనిపోయారు. అయితే, ఈ దాడుల వెనుక సాజిద్ ప్రమేయం ఉందని ఎన్ఐఏ భావిస్తోంది.


Similar News

టమాటా @ 100