అయ్యప్ప దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

శబరిమల అయ్యప్ప దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారానే దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేసింది.

Update: 2024-10-05 14:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: శబరిమల అయ్యప్ప(Sabarimala Ayyappa) దర్శనంపై కేరళ ప్రభుత్వం(Kerala Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారానే దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేసింది. రోజుకు గరిష్ఠంగా 80 వేల మందికి అయ్యప్పస్వామి దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. వర్చువల్‌ క్యూ బుకింగ్‌ సమయంలో యాత్రికులు తమ ప్రయాణ మార్గాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మూడు నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంతకుముందు ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం 10 రోజుల ముందు మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని మూడు నెలల ముందు వరకు పెంచింది ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు. గతేడాది డిసెంబరులో మండల పూజల సమయంలో శబరిమలకు భక్తులు పోటెత్తారు. కొందరు భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే తిరిగి స్వగృహాలకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ ఏడాది మండల పూజలు, మకరవిళక్కు ఉత్సవాల సమయంలో స్పాట్ బుకింగ్​లను దేవస్థానం బోర్డు రద్దు చేసింది.


Similar News

టమాటా @ 100