మసీదు కూల్చేయాలని కోర్టు ఆదేశం

హిమాచల్ ప్రదేశ్‌లోని సంజౌలి మసీదును కూల్చేయాలని ఆ మసీదు కమిటీకి కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సొంత ఖర్చుతో రెండో నెలల్లో మూడు అంతస్తుల సంజౌలి మసీదును తొలగించాలని షిమ్లా మున్సిపల్ కమిషనర్(ఎంసీ) కోర్టు స్పష్టం చేసింది.

Update: 2024-10-05 17:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లోని సంజౌలి మసీదును కూల్చేయాలని ఆ మసీదు కమిటీకి కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సొంత ఖర్చుతో రెండో నెలల్లో మూడు అంతస్తుల సంజౌలి మసీదును తొలగించాలని షిమ్లా మున్సిపల్ కమిషనర్(ఎంసీ) కోర్టు స్పష్టం చేసింది.సంజౌలి మసీదు అక్రమంగా నిర్మించారని ఆరోపణలు వచ్చాయి. కొన్ని హిందూ సంఘాలు నిరసనలు కూడా చేశాయి. ఈ నేపథ్యంలోనే వివాదం కోర్టుకు చేరింది. ఇవి మధ్యంతర ఉత్తర్వులే తుది తీర్పు ఇంకా రావాల్సి ఉన్నదని ముస్లిం వక్ఫ్ బోర్డ్ తరఫున వాదిస్తున్న అడ్వకేట్ బీఎస్ ఠాకూర్ తెలిపారు.

మసీదు ప్రాంగణానికి వెలుపలగా ఉన్న నిర్మాణాన్ని తొలగించాలని కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో తమనూ పార్టీగా చేయాలని కొందరు స్థానికులు చేసిన విజ్ఞప్తులను కోర్టు తిరస్కరించింది. రెండు నెలల్లో సొంత ఖర్చుతో మసీదు కమిటీ ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News

టమాటా @ 100