చైనాకు అనుకూలంగా నిర్ణయాలు.. పరిశోధన నౌకలపై నిషేధం ఎత్తివేసిన శ్రీలంక

చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు శ్రీలంక సిద్ధమైంది. భారత్ పై నిఘా పెట్టేందుకు డ్రాగన్ కు సాయం చేస్తోంది. ఇప్పటికే లంకకు చైనా నుంచి తీసుకున్న అప్పుల భారం పెరిగిపోయింది.

Update: 2024-07-07 10:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు శ్రీలంక సిద్ధమైంది. భారత్ పై నిఘా పెట్టేందుకు డ్రాగన్ కు సాయం చేస్తోంది. ఇప్పటికే లంకకు చైనా నుంచి తీసుకున్న అప్పుల భారం పెరిగిపోయింది. దానికి బదులుగా హంబన్ టోట పోర్టుని డ్రాగన్ కు లీజుకు ఇచ్చింది. తరచుగా చైనాకు చెందిన రీసెర్చ్ షిప్ లు తరచూ అక్కడే ఉంటున్నాయి. భారత్, అమెరికా లేవనెత్తిన భద్రతా పరమైన ఆందోళనలు దృష్ట్యా పరిశోధన నౌకలపై శ్రీలంక నిషేధాన్ని విధించింది. ప్రస్తుతం పరిశోధన నౌకలపై ఉన్న నిషేధాన్ని వచ్చే ఏడాదిని నుంచి ఎత్తేయాలని శ్రీలంక నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని జపాన్ మీడియా తెలిపింది. జపాన్ సందర్శించిన శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ తన వైఖరిని స్పష్టం చేశారు. జపాన్ మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వివిధ దేశాలకు వేర్వేరు నిబంధనల్ని కలిగి ఉండదని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ అన్నారు. చైనాను మాత్రమే అడ్డుకోలేమని స్పష్టం చేశారు. ఇతర దేశాల వివాదంతో తమ దేశం ఎవరి పక్షాన ఉండబోదని వెల్లడించారు. మారటోరియం వచ్చే ఏడాది జనవరి వరకు ఉందని గుర్తుచేశారు. వచ్చే ఏడాది నుంచి తమ పోర్టుల్లోకి విదేశీ పరిశోధన నౌకల్ని నిషేధించమన్నారు.

ఆందోళన వ్యక్తం చేసిన భారత్

హిందూ మహాసముద్రంలో చైనీస్ పరిశోధనా నౌకల కదలికలు పెరగడంతో, అవి గూఢచారి నౌకలు కావచ్చని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి నౌకలను అనుమతించవద్దని శ్రీలంకను కోరింది. భారత్ ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత జనవరిలో ఇలాంటి నౌకలపై శ్రీలంక నిషేధాన్ని విధించింది. ఆ తర్వాత చైనా నౌకకు మినహాయింపు ఇచ్చింది. కానీ, నిషేధం కొనసాగుతోందని తెలిపింది. ప్రస్తుతం ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.


Similar News

టమాటా @ 100