స్టాక్ మార్కెట్ రికార్డు ర్యాలీపై సెబీ, శాట్‌లకు సీజేఐ చంద్రచూడ్‌ సలహా

పెరుగుతున్న స్టాక్ మార్కెట్ల స్థాయిలు స్థిరమైన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఆవశ్యకతను గుర్తుచేస్తాయి.

Update: 2024-07-04 17:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా సరికొత్త రికార్డు గరిష్ఠాలను తాకుతున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్(శాట్)లను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెరుగుతున్న స్టాక్ మార్కెట్ల స్థాయిలు స్థిరమైన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఆవశ్యకతను గుర్తుచేస్తాయన్నారు. మార్కెట్లలో ఎంత పెరుగుదలను చూస్తారో, సెబీ, శాట్‌ల పాత్ర అంత ఎక్కువ ఉంటుందని గ్రహించాలి. ఇలాంటి సమయంలో రికార్డు గరిష్ఠాలను ఎంత సెలబ్రేట్ చేసుకుంటారో, అంతే అప్రమత్తంగా ఉండాలని సీజేఐ హెచ్చరించారు. గురువారం ముంబైలో శాట్ కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన చంద్రచూడ్.. పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఆర్థిక లక్ష్యాలు అధిగమించేందుకు చట్టపరమైన రక్షణ, సమర్థవంతమైన వివాద పరిష్కార యంత్రాంగాలు కీలకమైనవని అన్నారు. 


Similar News