కొత్త నేర చట్టాల కింద సీబీఐ తొలి ఎఫ్ఐఆర్.. ఏ కేసులో అంటే?

కొత్త నేర చట్టాల కింద సీబీఐ తొలి ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. తీహార్ జైలులో ఉన్న వ్యక్తిని విడుదల చేసేందుకు ఇద్దరు అధికారులు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేశారు.

Update: 2024-07-04 18:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కొత్త నేర చట్టాల కింద సీబీఐ తొలి ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. తీహార్ జైలులో ఉన్న వ్యక్తిని విడుదల చేసేందుకు ఇద్దరు అధికారులు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో, కొత్తగా అమలు చేసిన భారతీయ న్యాయ సంహిత కింద ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అవినీతి నిరోధక చట్టం కింద నేరపూరిత కుట్ర, లంచానికి సంబంధించిన నిబంధనలకు సంబంధించి బీఎన్‌ఎ 61(2) కింద కేసు నమోదైంది. మారిస్ నగర్‌లోని నార్కోటిక్స్ సెల్‌లో పోస్ట్ చేసిన హెడ్ కానిస్టేబుళ్లు రవీంద్ర ఢాకా, పర్వీన్ సైనీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

39 మంది సీబీఐ అధికారులకు పతకాలు

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి చెందిన 39 మంది అధికారులను రాష్ట్రపతి పోలీసు పతకం(పీపీఎం), ఇండియన్ పోలీస్ మెడల్(ఐపీఎం)తో సత్కరించారు.విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు 39 మందిని కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పతకాలతో సత్కరించారు. గురువారం ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని సీబీఐ అకాడమీలో సత్కార కార్యక్రమం జరిగింది. అక్కడ కేంద్రమంత్రి అర్జున్ రాంమేఘ్వాల్ ప్రసంగించారు. నేర పరిశోధనలో సీబీఐ పాత్రను ప్రశంసించారు. సంక్లిష్టమైన, సున్నితమైన కేసుల విషయానికి వస్తే సీబీఐ దర్యాప్తు చేయాలని పదే పదే వినిపిస్తూ ఉంటుందని ఆయన అన్నారు.


Similar News