UGC-NET: యూజీసీ-నెట్ అడ్మిట్ కార్డులు విడుదల

యూజీసీ-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024(UGC-NET) ఎగ్జామ్స్ వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 16 వరకు జరుగనున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-29 11:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: యూజీసీ-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024(UGC-NET) ఎగ్జామ్స్ వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 16 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. మొత్తం రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనుండగా.. సెషన్-1 ఎగ్జామ్స్ ఉదయం 9-12 వరకు, సెషన్-2 ఎగ్జామ్స్ మధ్యాహ్నం 3-6 వరకు జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ పరీక్షలకు సంబంధించింది అడ్మిట్ కార్డులు తాజాగా విడుదలయ్యాయి. పరీక్షకు అప్లై చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.ac.in/లో అప్లికేషన్ నంబర్(Application No), డేట్ ఆఫ్ బర్త్(DOB), సెక్యూరిటీ పిన్(Security Pin) డీటెయిల్స్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులుపై ఫోటో(Photo), బార్ కోడ్(Bar Code), క్యూ ఆర్ కోడ్(QR Code)లను అభ్యర్థులు ఓ సారి చెక్ చేసుకోవాలని, సరిగ్గా లేకుంటే మరోసారి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలకు అభ్యర్థులు వెబ్‌సైట్ ను సందర్శించగలరు.

Tags:    

Similar News