Eli Lilly : ఒబేసిటీ, డయాబెటిస్ కోసం పాపులర్ ఔషధం మాంజారో విడుదల చేసిన ఎలి లిల్లీ

అయితే, దీని ధర గురించి కంపెనీ స్పష్టత ఇవ్వలేదు

Update: 2025-03-20 09:30 GMT
Eli Lilly : ఒబేసిటీ, డయాబెటిస్ కోసం పాపులర్ ఔషధం మాంజారో విడుదల చేసిన ఎలి లిల్లీ
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాకు చెందిన బహుళజాతి ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ భారత మార్కెట్లో తన పాపురల్ వెయిట్‌లాస్ ఔషధం మాంజారోను భారత మార్కెట్లో విడుదల చేసింది. వారానికొకసారి ఇంజెక్షన్‌ రూపంలో తీసుకునే మాంజారో(రసాయనిక నామం-టిర్జెపటైడ్) మెడిసిన్ స్థూలకాయం, టైర్-2 మధుమేహం కోసం ఉపయోగించనున్నారు. ఈ మేరకు భారత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీఓ) నుంచి అనుమతి పొందినట్టు కంపెనీ గురువారం ప్రకటనలో వెల్లడించింది. అయితే, దీని ధర గురించి కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. ఈ ఔషధానికి అమెరికా, యూరప్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో ఊబకాయం, మధుమేహం కేసులు పెరగడం ప్రజారోగ్యానికి కీలక సవాలుగా మారిందని లిల్లీ ఇండియా ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ విన్సెలా టకర్ అన్నారు. భారత్‌లో సుమారు 10.1 కోట్ల మంది మధుమేహం, ఊబకాయాన్ని ఎదుర్కొంటున్నారు. ఇది దీర్ఘకాలిక వ్యాధి, మధుమేహం ప్రమాదకరంగా మారిందని టకర్ అభిప్రాయపడ్డారు. కాగా, మాంజారో ఔషధాన్ని ప్రస్తుతం యూకే, యూరప్‌లలో మధుమేహం, బరువు తగ్గించడం కోసం అదే బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు. అమెరికాలో ఊబకాయం కోసం దీనిని జెప్‌బౌండ్‌ పేరుతో మార్కెట్లో ఉంది. అమెరికా అధ్యయనాల్లో మాంజారో ఔషధాన్ని 72 వారాలపాటు గరిష్ట మోతాదులో (15ఎంజీ) తీసుకోవడం ద్వారా సగటున 21.8 కిలోలను, కనిష్ట మోతాదు(5ఎంజీ) తీసుకుంటే 15.4 కిలోల బరువు తగ్గేందుకు దోహదపడిందని తేలింది. మరో అధ్యయనంలో ముగ్గురు రోగులలో ఒకరు వారి శరీర బరువులో 25 శాతానికి పైగా కోల్పోయారు. ఇది ప్లాసిబో విధానంలో కంటే 1.5 శాతం కంటే చాలా ఎక్కువ. అయితే, ఈ ఔషధ వాడకంలో స్వల్ప సైడ్-ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. వైద్యుడి సూచన మేరకే వినియోగించాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News