మైనర్ వక్షోజాలు పట్టుకోవడం అత్యాచారానికి ప్రయత్నించడం కాదు.. అలహాబాద్ హై కోర్టు సంచలన తీర్పు
మైనర్ వక్షోజాలు పట్టుకోవడం అత్యాచారానికి ప్రయత్నించడం కాదని అలహాబాద్ హై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: మైనర్ వక్షోజాలు పట్టుకోవడం అత్యాచారానికి ప్రయత్నించడం కాదని అలహాబాద్ హై కోర్టు (Alahabad High Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. బాధితురాలిపై నిందితుడు లైంగిక దాడికి ప్రయత్నించాడని ఎటువంటి ఆరోపణ లేదని పేర్కొంది. ఘటన ప్రకారం పవన్, ఆకాష్ అనే ఇద్దరు యువకులు 11 ఏళ్ల బాలిక వక్షోజాలు పట్టుకున్నారని, వారిలో ఒకరు ఆమె పైజామా దారాన్ని తెంపివేయగా.. మరొకరు కల్వర్టు కిందికి లాగడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఈ లోపు బాటసారులు గమణించి, కేకలు వేయడంతో నిందితులు బాలికను వదిలి పారిపోయారని చెప్పి కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో అలహాబాద్ ట్రయల్ కోర్టు (Trail Court).. పోక్సో చట్టం (Pocso Act)లోని సెక్షన్ 376 (అత్యాచారం), సెక్షన్ 18 ( నేరం చేయడానికి ప్రయత్నించడం) కింద విచారణకు హాజరు కావాలని నిందితులకు సమన్లు పంపింది.
ట్రయల్ కోర్టు ఇచ్చిన సమన్లను నిందితులు అలహాబాద్ హైకోర్టు లో సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా (Justice Ram Manohar Narayan Mishra) సంచలన వ్యాఖ్యలు చేశారు. సమన్లలోని సెక్షన్లను సవరిస్తూ సంచలన తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. మైనర్ బాలిక వక్షోజాలను పట్టుకోవడం, ఆమె పైజామా దారాన్ని తెంపివేయడం, పారిపోయే ముందు కల్వర్లు కిందికి లాగడం వంటి చర్యలు అత్యాచారం కానీ, అత్యాచార ప్రయత్నం కింద కానీ పరిగణించబడవని అన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం నిందితులు చేసింది.. సమన్లలో పేర్కొన్న పోక్సో చట్టంలోని సెక్షన్ 376, సెక్షన్ 15 నేరాల కిందికి రాదని, బదులుగా నిందితులకు పోక్సో చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354-B (మహిళల గౌరవాన్న దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద సమన్లు జారీ చేయాలని సంచలన తీర్పును వెలువరించారు.