Israel-Hamas: గాజాపై భీకర దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్‌.. కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి తూట్లు

Israel-Hamas: పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది.

Update: 2025-03-20 07:29 GMT
Israel-Hamas: గాజాపై భీకర దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్‌.. కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి తూట్లు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: Israel-Hamas: పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. ఈమధ్యే ఇజ్రాయెల్(Israel) జరిపిన భీకర దాడుల్లో 400మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా గాజా(Gaza)పై ఇజ్రాయెల్(Israel) వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపు 70 మంది మరణించినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం గాజాపై ఐడీఎఫ్(IDF) దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు చాలా మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ మహిళతో సహా అనేక మంది చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు. ఇక ఇజ్రాయెల్(Israel) రక్షణమంత్రి కాట్జ్ గాజాకు తీవ్ర హెచ్చరికలు చేశారు. బందీలందారినీ తిరిగివ్వడానికి ఇదే చివరి అవకాశమని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని పేర్కొన్నారు.

మరోవైపు నెట్జారిమ్(Netjarim) నడవాలో కొంత భూభాగాన్ని టెల్ అవీవ్(Tel Aviv) స్వాధీనం చేసుకుంది. ఇక్కడి నుంచి పాలస్తీనా(Palestine)వాసుల కదిలికలను నియంత్రించే వెలసుబాటు దానికి దక్కింది. కాగా మంగళవారం గాజాపై ఇజ్రాయెల్(Israel) భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 400మందికిపైగా మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారిలో చిన్నారులు, మహిళలే ఎక్కువమంది ఉన్నారు. ఇజ్రాయెల్ -హమాస్ ల మధ్య తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన విషయం తెలిసిందే.

ఈ ఒప్పందంలో మార్పులు చేయడానికి హమాస్(Hamas) తిరస్కరించడంతోనే దాడులకు ఆదేశించానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Netanyahu) తెలిపారు. బందీలను విడుదల చేయడానికి హమాస్ పదే పదే నిరాకరిస్తోందని, యుద్ధ లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు చేస్తోందని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ ఇప్పటి నుంచి హమాస్ కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ దాడులను హమాస్ తీవ్రంగా ఖండించింది.

టెల్ అవీవ్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని పేర్కొంది. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మిలిటెంట్ సంస్థ హెచ్చరించింది. కాగా నెత్జారిమ్ కారిడార్ మధ్యలో తమ దళాలు తిరిగి తమ ఆధీనంలోకి వచ్చాయని ఇజ్రాయెల్ తెలిపింది. 252వ డివిజన్ నుండి దళాలు నెట్జారిమ్ కారిడార్ లోకి ప్రవేశించాయి. ఇది గాజాను ఉత్తర, దక్షిణ రంగాలుగా విభజించే కీలక మార్గం. దాదాపు సగం కారిడార్ ను స్వాధీనం చేసుకుని సలాహ్ ఎ దిన్ రహదారి వరకు చేరింది. ఐడిఎఫ్ అదే సమయంలో దక్షిణ గాజా సరిహద్దుకు ఎలైట్ గోలాని బ్రిగేడ్‌ను మోహరిస్తున్నట్లు ప్రకటించింది. 

Tags:    

Similar News