యూజీసీ-నెట్ పరీక్ష తేదీలు ప్రకటించిన ఎన్‌టీఏ

దిశ, నేషనల్ బ్యూరో: యూజీసీ-నెట్ పరీక్ష జూన్ 18న జరగగా.. ఆ మరుసటి రోజే(జూన్ 19న) దాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-28 18:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: యూజీసీ-నెట్ పరీక్ష జూన్ 18న జరగగా.. ఆ మరుసటి రోజే(జూన్ 19న) దాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షను తిరిగి నిర్వహించే తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం రాత్రి ప్రకటించింది. యూజీసీ- నెట్ పరీక్షను ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 4 తేదీల మధ్యలో తిరిగి నిర్వహిస్తామని వెల్లడించింది. ఇంతకుముందు జూన్ 18న యూజీసీ-నెట్ పరీక్ష ఆఫ్ లైన్ పద్ధతిలో జరిగింది. అభ్యర్థులు పేపర్, పెన్నుతో పరీక్ష రాశారు. అయితే ఈసారి అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తామని ఎన్‌టీఏ తెలిపింది.ఈమేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక ‘ఎన్‌సెట్’ పరీక్షను జులై 10న, ‘సీఎస్ఐఆర్- యూజీసీ నెట్’ పరీక్షను జులై 25 నుంచి 27 తేదీల మధ్య నిర్వహిస్తామని తెలిపింది. ఆలిండియా ఆయుష్ పీజీ ఎంట్రెన్స్ టెస్టు మునుపటి షెడ్యూల్ ప్రకారమే (జులై 6న) జరుగుతుందని స్పష్టం చేసింది.


Similar News