మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?

హీరో ఉదయనిధి స్టాలిన్ ఇవాళ తమిళనాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Update: 2022-12-14 02:45 GMT

దిశ, వెబ్ డెస్క్: హీరో ఉదయనిధి స్టాలిన్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో.. ఇవాళ తమిళనాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. తన తండ్రి ఎంకే స్టాలిన్ కేబినెట్ లో ఉదయనిధి స్టాలిన్ చేరనున్నాడు. తమిళనాడు రాజ్‌భవన్ అధికారిక సమాచారం ప్రకారం.. దర్బార్ హాల్‌లో ఈ రోజు ఉదయం 9.30 గంటలకు ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. గ్రామీణాభివృద్ధి మరియు యువజన, క్రీడా వ్యవహారాల శాఖలను ఆయనకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఉదయనిధి స్టాలిన్ తమిళనాడులోని చేపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఇక ఇప్పటికే ఆయన డీఎంకే యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నాడు. 

Read More...

India- UAE Relations: భారత్-యూఏఈ సంబంధాలు బలపడాలి 

Tags:    

Similar News